బిగ్‌బాస్‌లో ప్రతి వారం ఒకరు ఎలిమినేషన్ అవుతూ ఉంటారు. ఈ పద్ధతి ఇప్పటి వరకు వస్తోంది. అయితే ఇకపై ఎలిమినేషన్ తీసేని మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అదే ఇన్విజబుల్. తొలి ప్రయత్నంగా దీనిని ఇకపై హిందీ బిగ్‌బాస్-14లో అమలు చేస్తారు. హిందీ బిగ్‌బాస్ సీజన్ 14లో షెహజాద్ డియాల్, అభినవ్ శుక్లా, కుమార్ సాను ఎలిమినేషన్లో ఉన్నారు. అయితే ఈ సారి ఎలిమినేషన్‌కు బదులుగా ఇన్విజబుల్ ఉంటుందని హోస్ట్ సల్మాన్‌ఖాన్ ఇప్పటికే ప్రకటించారు.
ఇన్విజబుల్ అంటే ఏమిటి…
ఇన్విజబుల్ సభ్యుడు బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉంటాడు. అయితే అతడికి ఏ టాస్క్ ఇవ్వరు. అతడు నిర్ణయాత్మక అంశాల్లో పాలు పంచుకోడు. హౌస్‌లో జరిగే ఏ డిస్కర్షన్లోనూ అతడు పాలు పంచుకోడు. ఏదో హౌస్‌లో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టుగానే ఉంటాడు. ఓ విధంగా చెప్పాలంటే అతడు హౌస్‌లో ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే అన్నమాట.
బిగ్‌బాస్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇన్విజబుల్ గానే ఆ కంటెస్టెంట్ ఉంటాడు. అప్పుడు కూడా అతడి ప్రవర్తన సరిగా లేకపోతే బిగ్‌బాస్ ఆదేశాల మేరకు అతడు హౌస్ నుంచి ఎప్పుడు అయినా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ పక్రియను హిందీ బిగ్‌బాస్‌లో అమలు చేస్తున్నారు. ఇది ఇక్కడ సక్సెస్ అయితే మిగిలిన భాషల్లో అమలు చేస్తారు.