ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ మయం కావడంతో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. సైబర్ ప్రేమలు, సైబర్ దోపిడీలు, సైబర్ చీటింగ్‌లు మామూలుగా లేవు. ఇక ఎక్కువ మంది అమ్మాయిలు అపరిచిత వ్యక్తులతో సైబర్ నేరగాళ్ల వలలో పడిపోయి సర్వస్వం అర్పించుకుంటున్నారు. అమ్మాయిల వ్యక్తిగత సమాచారం తీసుకున్నాక వారిని డబ్బులు, లైంగీక దోపిడీ కోసం బెదిరిస్తున్నారు. దీంతో చాలా మంది అమ్మాయిలు మానసిక వేదనతో తమ బాధ ఎవ్వరికి చెప్పుకోలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
సమాజంలో జరుగుతోన్న ఈ అకృత్యాలకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు తాజాగా సైబర్ మోసాలకు సంబంధించి ఎన్టీఆర్‌తో ఓ వీడియోని రూపొందించి విడుదల చేశారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ వ్యక్తి వల్ల మహిళ ఎంత మానసిక క్షోభ, సంఘర్షణకు గురైందో చూపించారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇలాంటి మోసాలలో చిక్కుకోకుండా ఉండేందుకు యువత చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం ఎవ్వరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని… అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్ పరిచయాలు వద్దని వార్నింగ్ ఇచ్చాడు. మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా సూచించాడు. ఎన్టీఆర్ యువతలో ధైర్యం నింపేలా ఇచ్చిన ఈ మెసేజ్‌కు ప్రశంసల జల్లు కురుస్తోంది.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) October 8, 2020