సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడు అనగానే మనకు మహేష్‌బాబు మాత్రమే గుర్తుకు వస్తాడు. అయితే మహేష్ కన్నా పెద్దవాడు అయిన రమేష్‌బాబు గురించి ఈ తరం జనరేషన్‌కు పెద్దగా తెలియదు. మహేష్ కంటే ముందే రమేష్ హీరోగా పరిచయం అయ్యాడు. బజార్‌రౌడీ ( నదియా హీరోయిన్) లాంటి కొన్ని సినిమాలు చేసినా అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అతడి కెరీర్‌కు ఉపయోగ పడలేదు. దీంతో నిర్మాతగా మారి రెండు భారీ సినిమాలు కూడా నిర్మించాడు.
ఆ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో వ్యాపారాల్లో రమేష్ బిజీ అయ్యాడు. వాస్తవానికి బయట ఫంక్షన్లలో వీరు ఎప్పుడూ కనపడరు. ఎవరి బిజీ వారిది.. ఎవరి జీవితాలు వాళ్లవే. అయితే ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంటుంది. ఇటీవల రమేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు మహేష్ చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు అన్నతో ఉన్న ఫొటో షేర్ చేశాడు.
నా అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నా అభ్యాసంలో కొంత భాగం అతడి నుంచే నేర్చుకున్నానని.. క్రమశిక్షణ, అభిరుచి నిస్వార్థంగా నా అన్న నాకు ఇచ్చాడంటూ ప్రశంసించాడు. మీకు మంచి ఆరోగ్యం దక్కాలని కూడా తాను కోరుకుంటున్నానని మహేష్ చెప్పాడు.