మహేష్ – త్రివిక్రమ్ అంటే ఒకరికకొరు ఇష్టమే. వీరిద్దరి కాంబోలో మూడో సినిమా కోసం ఇద్దరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అనే ప్రెస్టేజియస్ ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే ఛాన్సులు ఉండడంతో మహేష్, త్రివిక్రమ్‌తో సినిమా చేయాలన్న ఊగిసలాటలో ఉన్నాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రివిక్రమ్, మహేష్‌తో సినిమా చేయాలంటే ముందు ఎన్టీఆర్ ఓకే చెప్పాలి. అయితే అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ తన సినిమా కాదని మరో హీరోకు వెళ్లేందుకు ఎన్టీఆరే కాదు ఏ హీరో ఒప్పుకోని పరిస్థితి.
నాగచైతన్యతో కమిట్ అయినా కూడా పరశురాంను పట్టుబట్టి మరీ మహేష్ తన వైపునకు తిప్పుకున్నాడు. ఇప్పుడు పరశురాంను కాదని త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నాడని అతడితో సినిమా చేయడం కరెక్ట్ అనిపించుకోదు. ఒక వేళ ఎలాగోలా తంటాలు పడి ఇప్పటికిప్పుడు త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కిస్తే పరశురాం 2022 సమ్మర్ వరకు ఖాళీగా ఉండాలి. అంటే 2021 సమ్మర్లో త్రివిక్రమ్ సినిమా విడుదల అయితే 2022 సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ ఉంటుంది. అప్పుడు పరశురాం సినిమా 2021లో వచ్చే ఛాన్స్ ఉండదు.. 2022లోనే ఉంటుంది.
ముందుగా త్రివిక్రమ్ సినిమా చేసి పరశురాంను అప్పటి వరకు ఖాళీగా ( 2022 వరకు) ఉంచితే ఇండస్ట్రీలో మహేష్ క్రెడిబులిటీ ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఏదేమైనా ఇవన్నీ కలిసి మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు బ్రేకులు అయ్యాయి. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ లేట్ అయ్యేలా ఉండడం.. త్రివిక్రమ్ మరో యేడాది పాటు ఖాళీగా ఉండడం పరిణామాలు ఇండస్ట్రీలో చాలా మార్పులకు కారణమవుతున్నాయి. చాలా పెద్ద ప్రాజెక్టులు తల్లకిందులు అవుతున్నాయి.