బిగ్‌బాస్ నుంచి కుమార్ సాయి అవుట్‌.. ఆ కోరిక తీర్చేసిన నాగ్‌

బిగ్‌బాస్‌లో లీకువీరులు చెప్పిందే నిజ‌మైంది. టాస్కులు బాగా ఆడే కుమార్ సాయి బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ప్రైవేటుగా ఉన్న అన్ని పోల్స్‌లోనూ మోనాల్‌కు త‌క్కువ ఓటింగ్ వ‌చ్చింది. వాస్త‌వంగా చూస్తే మోనాల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాలి. అయితే హౌస్‌లో గ్లామ‌ర్ బాగా ఒల‌క బోయ‌డంతో పాటు ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీలు బాగా న‌డుపుతూ సేఫ్ గేమ్ ఆడుతోన్న మోనాల్‌ను హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంప‌రంటూ ముందు నుంచి లీకు వీరులు అనుమానిస్తున్నారు.

 

ఇప్పుడు లీకు వీరులు అనుకున్న‌దే నిజం అయ్యింది. చివ‌ర‌గా మోనాల్‌, కుమార్ సాయిని క‌న్పెష‌న్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్ కుమార్ ఎలిమినేట్ అవుతున్నాడ‌ని చెప్పాడు. అయితే కుమార్ సాయి వ‌చ్చిన‌ప్ప‌ట‌కీ ఇప్ప‌ట‌కీ చాలా పుంజుకున్నాడు. టాస్క‌ల్లో బ‌ల‌మైన పోటీ ఇస్తున్నాడు. కానీ అత‌డికి ఘ‌న‌మైన‌, ఆత్మీయ వీడ్కోలు మాత్రం ద‌క్క‌క‌పోవ‌డం బాధాక‌రం.

 

అయితే కుమార్ షోకు వ‌చ్చాక కోరిన మూడు కోరిక‌ల్లో ఒక కోరిక‌ను నాగార్జున తీర్చేశాడు. దీంతో తాను అకున్న‌ది సాధించాన‌ని కుమార్ సాయి స్టేజ్‌మీద గెంతులు వేశాడు. కుమార్ సాయి డైరెక్ష‌న్ ఛాన్స్ కోసం క‌థ చెపుతాన‌ని ఇంత‌కు ముందే చెప్ప‌గా.. కుమార్ చెప్పే కథ వింటాన‌ని నాగ్ చెప్పాడు.