నాని గీత దాటేస్తున్నాడా.. ఇలా అయితే దెబ్బ తింటాడా..!

నేచుర‌ల్ స్టార్ నాని టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఇటీవ‌ల నాని ట్రాక్ రికార్డు చూస్తే జెర్సీ మిన‌హా మిగిలిన సినిమాలేవి ఆడ‌లేదు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే నానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేసిన అనుభ‌వం ఉండ‌డంతో క‌థ‌ల ఎంపిక‌తో పాటు బ‌డ్జెట్‌, మార్కెట్ విష‌యాలో చాలా లెక్క‌ల‌తో ఉండేవాడు. అయితే ఇప్పుడు నాని చేసిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం లేదు. నానికి వ‌రుస హిట్లు వ‌చ్చాక‌… త‌న రెమ్యున‌రేష‌న్ పెరిగినా బ‌డ్జెట్‌ను మాత్రం ఎప్పుడు కంట్ర‌ల్లోనే ఉంచేవాడు.

 

అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది.. నాని మార్కెట్ ప‌డిపోయింది.. అయితే అత‌డి సినిమాల బ‌డ్జెట్ మాత్రం విప‌రీతంగా పెరిగిపోతోంద‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. నాని సినిమాలు వ‌రుస‌గా ఎదురు త‌న్న‌డం ఒక మైన‌స్ అయితే.. ఇప్పుడు క‌రోనా దెబ్బ‌తో కూడా మార్కెట్ మ‌రింత ప‌డిపోయింది. అంతెందుకు ఓటీటీలో వ‌చ్చి ప్లాప్ అయిన నాని వీ సినిమాకు భారీగానే బ‌డ్జెట్ పెట్టారు. తీరా రిజ‌ల్ట్ చూస్తే తుస్సుమంది.

 

అంత‌కు ముందు గ్యాంగ్ లీడ‌ర్‌, దేవ‌దాసు సినిమాలు కూడా భారీగానే బ‌డ్జెట్ అయ్యింది. ఇప్పుడు శ్యామ్‍ సింగ రాయ్‍ సినిమాకు రు. 40 కోట్లు అవుతుంద‌నే నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ త‌ప్పుకోవ‌డంతో మ‌రో నిర్మాత లైన్లోకి రావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌పై నాని త‌న సినిమాల బ‌డ్జెట్ విష‌యంలో కంట్రోల్‌గా ఉంటే అత‌డి సినిమాల‌కు లాభాలు రావ‌డంతో పాటు ఎక్కువ ఛాన్సులు వ‌స్తాయి.. లేక‌పోతే ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వు.