Politicsబ్రేకింగ్‌: ఎమ్మెల్సీగా క‌విత‌... బంప‌ర్ మెజార్టీతో గెలుపు

బ్రేకింగ్‌: ఎమ్మెల్సీగా క‌విత‌… బంప‌ర్ మెజార్టీతో గెలుపు

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్ధి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తిరుగులేని విజ‌యం సాధించారు. తొలి రౌండ్‌లోనే ఆమెకు తొలి ప్రాధాన్య‌త ఓట్లు రావ‌డంతో క‌విత గెలుపున‌కు తిరుగు లేకుండా పోయింది. పోటీ చేసిన కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్థుల‌కు క‌నీసం డిపాజిట్లు కూడా రాలేదు.

 

గ‌త యేడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా పోటీ చేసిన క‌విత బీజేపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ఆమె రాజ‌కీయంగా సైలెంట్‌గా ఉంటూ వ‌స్తున్నారు. అయితే నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ సీటు ఖాళీ అవ్వ‌డంతో అక్క‌డ నుంచి పార్టీ త‌ర‌పున ఎంతో మంది పోటీలో ఉన్నా కేసీఆర్ క‌విత‌నే రంగంలోకి దింపారు.

 

అక్క‌డ టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీల‌కు చెందిన ప‌లువురు కూడా కారెక్క‌డంతో అసలు క‌విత గెలుపు విష‌యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల అభ్య‌ర్థులు పోటీ కూడా ఇవ్వ‌లేదు. ఈ ఎన్నికల్లో విజయం కోసం మంత్రి కేటిఅర్ పక్కా వ్యూహాలు సిద్దం చేశారు. మ‌రి మండ‌లిలోకి ఎంట్రీ ఇస్తోన్న క‌విత రాజ‌కీయం ఇప్పుడు స‌రికొత్త‌గా ఉండ‌నుంద‌నే చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news