2000 సంవత్సరాల్లో మౌనిక అనే హీరోయిన్ ఉందన్న విషయం కొద్ది మంది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. అప్పట్లో చిన్న చిన్న హీరోల పక్కన చిన్న చిన్న సినిమాల్లో నటించిన మౌనికకు పెద్దగా క్రేజ్ రాలేదు. శివరామరాజు సినిమాలో జగపతిబాబుతో పాటు వెంకట్, శివాజీ ఈ ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల చెల్లిగా నటించిన ఆమె ఆ సినిమాలో పండించిన సెంటిమెంట్ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది.
కోలీవుడ్‌కు చెందిన మౌనిక అక్కడ పెద్దగా గుర్తింపు లేకపోడంతో తెలుగులోనే ఎక్కువుగా సినిమాలు చేసింది. ఆ తర్వాత ఆమెకు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు రావడంతో తెలుగుకు పూర్తిగా దూరమైంది. ఇక సినిమాలు తగ్గిపోయాక ఆమె మాలిక్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడింది. ముస్లిం అయిన మాలిక్‌ను పెళ్లాడేందుకు ఆమె తన మతంతో పాటు పేరు కూడా మార్చేసుకుంది.
మాలిక్‌ను పెళ్లాడిన మౌనిక పెళ్లికి ముందే ఇస్లాం స్వీకరించడంతో పాటు తన పేరును రహీమాగా మార్చుకుంది. ఇక తాను పెళ్లి కోసమే మతం మార్చుకోలేదని.. ఇస్లాం మతంపై ఉన్న గౌరవంతోనే మతం మార్చుకున్నానని మౌనిక చెప్పింది. తెలుగు, తమిళ్, కన్నడలో మొత్తం 30 సినిమాల్లో నటించిన మౌనిక చివరి సారిగా 2016లో తమిళ్‌లో మీరా జకరతై సినిమాలో నటించింది.