ఏపీలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు కొద్ది రోజులుగా హాట్ హాట్గా నడుస్తోన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ సానుభూతి పరుడు అయిన వల్లభనేని వంశీ ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి పార్టీని వీడారన్న చర్చలు, విమర్శలు నడుస్తుండగానే.. ఆయన వైసీపీలోకి వెళ్లినా అక్కడ కూడా గ్రూపు రాజకీయాల్లో ఇమడ లేకపోతున్నారు. వంశీ గత రెండు ఎన్నికల్లోనూ ఓడించిన వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు నేతలతో పాటు ఆయ వర్గీయులు వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ మూడు వర్గాల్లో దుట్టా, యార్లగడ్డ వర్గాలు ప్రతి రోజు వంశీపై విరుచుకు పడుతున్నాయి. వంశీని అద్దె నాయకుడు అని విమర్శిస్తున్నాయి. గత వారం రోజులుగా ఈ వ్యవహారం రాజకీయంగా సెగలు రేపుతోంది. ఇదిలా ఉంటే గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పునాదిపాడులో ఈ రోజు జగన్ జగనన్న విద్యాదీవెన ప్రారంభించారు. ఈ సభలో జగన్ యార్లగడ్డ చేతిని పక్కనే ఉన్న వంశీ చేతిలో వేశారు. కలిసి పనిచేయాలని సూచించారు.
అయితే యార్లగడ్డ కాస్త అసహనంతో జగన్‌కు ఏదో చెప్పబోతుండగా.. జగన్ అవేవి వినిపించుకోనట్టు కనిపించింది. యార్లగడ్డ కడుపును అప్యాయంగా పట్టుకుని చిన్న నవ్వు నవ్వి వెళ్లిపోయారు. ఈ తతంగం చూసినవారు జగన్ వంశీపై ఫిర్యాదును లైట్ తీస్కొన్నారనే అంటున్నారు. యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదును ఆయన పట్టించుకోలేదని కూడా అక్కడ పలువురు గుసగుసలాడుకున్నారు.
దీనిని బట్టి గన్నవరం విషయంలో జగన్ అద్దె నాయకుడు వంశీ వైపే మొగ్గు చూపారన్న చర్చలు ప్రారంభమయ్యాయి. మరి జగన్ చెప్పినట్టు ఈ రెండు వర్గాలు కలిసి పనిచేస్తాయా ? మరి మధ్యలో మూడో వర్గం అయిన దుట్టా రామచంద్రరావు వర్గం ఏం చేస్తుందో ? చూడాలి.