దాదాపు ఆరేడు నెలలుగా మూసిన థియేటర్లు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తెరచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకుంటున్నా ఏపీలో మాత్రం ఎగ్జిబిటర్లు సమావేశమై సగం సీట్లతో థియేటర్లు తెరిచేందుకు అంగీకరించలేదు. ఇక సింగిల్ థియేటర్లు తెరవకపోయినా కొన్ని చోట్ల మాత్రం మల్టీఫ్లెక్స్‌లు ఓపెన్ చేశారు.
త్వరలో రాజధాని కాబోతున్న విశాఖలో క్రౌడ్ ఉంటే సెంటర్లో ఓ ఐమాక్స్‌ను ఓపెన్ చేశారు. తొలి షోకు కేవలం నలుగురు ప్రేక్షకులే రాగా.. మొత్తం రు. 632 కలెక్షన్ వచ్చిందట. ఈ డబ్బులుతో ఏం చేసుకోవాలి.. ఇవి ఏ మూలకు వస్తాయిరా బాబు అని మల్టీఫ్లెక్స్ నిర్వాహకులు తలలు పట్టుకోవడంతో పాటు సాయంత్రానికే షోలు ఆపేశారు. ఏదేమైనా కరోనా భయం టీకా వచ్చే వరకు పూర్తిగా పోదనే చెప్పాలి. మరి ఈ లెక్కన సినిమా హాళ్లు ఎప్పటకి కళకళలాడతాయో ? చూడాలి.