Moviesసినిమాల‌కు నంద‌మూరి హీరోయిన్ బైబై... షాకింగ్ డెసిష‌న్ వెన‌క‌..!

సినిమాల‌కు నంద‌మూరి హీరోయిన్ బైబై… షాకింగ్ డెసిష‌న్ వెన‌క‌..!

చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లో నిల‌దొక్కుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డ‌తారు. ఎన్ని మంచి ఛాన్సులు వ‌చ్చినా.. ఎన్ని హిట్లు వ‌చ్చినా స‌క్సెస్ కాలేని వారు చివ‌ర‌కు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వ‌డ‌మో లేదా చేస్తుంటారు. మ‌రి కొంద‌రు హీరోయిన్లు ఆధ్యాత్మిక బాట ప‌డుతుంటారు. ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్లు ఛాన్సులు రాక‌పోవ‌డంతో సినిమాలు వ‌దిలేసి ఆధ్యాత్మిక బాట ప‌ట్టేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో అందాల తార స‌నాఖాన్ సైతం తాను సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని.. స‌మాజ‌సేవ‌, ఆధ్యాత్మిక బాట ప‌డుతున్నాన‌ని చెప్పింది.

Bigg Boss 6 contestant Sana Khan quits showbiz: To follow the order of my  Creator - Television News

ఈ విష‌యాన్ని ఆమె త‌న ఇన్ స్టా గ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. స‌నాఖాన్ అంటే మ‌న తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌దు కాని ఆమె క‌ళ్యాణ్‌రామ్‌ క‌త్తి, మిస్ట‌ర్ నూక‌య్య సినిమాల్లో న‌టించింది. అయితే ఆమెకు అనుకున్న రేంజ్‌లో అవ‌కాశాలు రాలేదు. త‌ర్వాత ఆమె ఓ భాయ్‌ఫ్రెండ్‌తో చాలా రోజుల పాటు ప్రేమాయ‌ణం న‌డిపింది. త‌ర్వాత అత‌డితో బ్రేక‌ప్ అయ్యింది. త‌ర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.

Ex-Bigg Boss contestant Sana Khan quits showbiz to 'serve humanity', her  industry friends offer support - bollywood - Hindustan Times

ఇక ఇప్పుడు అన్నీ వ‌దిలేసి ఆధ్యాత్మిక బాట‌ను ఎంచుకున్నాన‌ని ప్ర‌క‌టించి అంద‌రికి షాక్ ఇచ్చింది. తాను సినిమా రంగంలో డ‌బ్బుతో పాటు కావాల్సినంత పేరు తెచ్చుకున్నాన‌ని.. మ‌నిషి పుట్టింది కేవ‌లం డ‌బ్బు కోస‌మే కాద‌ని కూడా ప్ర‌క‌టించింది. మ‌నం చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంది ? అన్న విష‌యంపై తాను కొద్ది రోజులుగా ఆలోచ‌న చేస్తున్నాన‌ని.. చ‌నిపోయాక మంచి జీవితం పొంద‌డం కోస‌మే ఇప్పుడు తాను ఈ మార్గం ఎంచుకున్నాన‌ని స‌నా చెప్పింది.

 

దేవుడి ఆజ్ఞ ప్ర‌కార‌మే తాను సినిమాల‌కు స్వ‌స్తి చెప్పి ఆధ్యాత్మిక‌, స‌మాజ సేవ‌లో నిమ‌గ్నం అవుతున్నాన‌ని చెప్పింది. ఏదేమైనా స‌నా నిర్ణ‌యంతో ప‌లువురు తోటి న‌టీన‌టులు ఆమె మంచి మార్గంలో వెళుతోంద‌ని అభినందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news