టాలీవుడ్లో ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన వినాయక్ ఇప్పుడు సినిమాలు , డైరెక్షన్ అన్న విషయమే మర్చిపోయినట్లున్నాడు. చివరకు డైరెక్షన్‌కు దూరమై శీనన్న పేరుతో హీరో అవతారం ఎత్తాడు. దిల్ రాజు బ్యానర్లో కొత్త దర్శకుడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందంటున్నారు. ఈ క్రమంలోనే తన జీవితంలో జరిగిన ముఖ్య విషయాలతో పాటు తన పెళ్లికి ముందు జరిగిన అంశాలను వినాయక్ తన తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
వినాయక్‌కు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమట. అయితే సినిమాల్లోకి వెళితే పిల్లను ఇవ్వడానికి ఎవ్వరూ భయపడరని వినాయక్ నాన భయపడేవారట. అయితే ఇప్పుడు పెళ్లి అవసరమా ? పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామా ? పెళ్లి చేసుకుని ఏం పీకాలి ? అంటూ వినాయక్ తన తండ్రితో దెబ్బలాడేవాడట. ఇక ఆది సినిమా హిట్ అయ్యాక కాకినాడలో అభిమానుల సమక్షంలో వినాయక్ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.