ప్రపంచ మహానగరాల్లో హైదారాబాద్‌కు కూడా చోటు ఉంది. శాతాబ్దాల చరిత్ర హైదరాబాద్ సొంతం. కుతుబ్‌షాహీలు, ఇటు నిజాంలో పాలించిన హైదరాబాద్ ఆ తర్వాత దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రానికి రాజధానిగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాజధానిగా ఉంది. ఇక ఇంత గొప్ప చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం పుట్టింది ఎప్పుడు ? ఈ మహా నగరానికి ఎప్పుడు బీజం పడింది ? అన్న ప్రశ్నకు ఆన్సర్‌గా చాలా మంది చరిత్రకారులు 1591 అని చెపుతారు.
అయితే తేదీ ఖచ్చితంగా తెలియకపోయినా మహ్మద్ కులీ ఆలోచనలతో.. ఇరానీ ఆర్కిటెక్టు మీర్ మోమిన్ సృజన నుంచి ఈ మహానగరం ప్లానింగ్ పురుడు పోసుకుంది. ఈ మహానగరం ప్రారంభించే రోజున రాజు అయిన కులీ ఏం కోరుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. హె అల్లా చేపలతో చెరువు ఎలా కళకళలాడుతుందో నా నగరాన్ని ప్రజలతో నింపేయమని కోరుకున్నాడట. నాడు కులీ ఏ ఉద్దేశంతో ఈ కోరిక కోరాడో కాని ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ మహానగరాల పక్కన చోటు సొంతం చేసుకుంది.
1591 అక్టోబరు 7న మహానగరానికి జన్మదినమని హైదరాబాద్ ట్రైల్స్ సంస్థ చెబుతోంది. ఓ ఫర్మానాలో పొందు పరిచిన అంశాల ఆధారంగా తాము హైదరాబాద్ పుట్టిన రోజును డిసైడ్ చేశామని ఈ సంస్థ నిర్వాహకుడు గోపాల క్రిష్ణ చెపుతున్నారు. చంద్రుడు సింహరాసిలోకి ప్రవేశించి.. బృహస్పతి తన స్థానంలోకి వెళ్లినప్పుడు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే భాగ్యనగరానికి పునాది పడిందంటారు.
ఫర్మానాలోని గ్రహస్థితి ఆధారంగా ఖగోళ శాస్త్ర నిపుణులు అక్టోబరు 7 వ తేదీ హైదరాబాద్ పుట్టిన రోజు అని కొందరు చెపుతారు. ఐదేళ్లుగా ఈ కార్యక్రమం నడుస్తున్నా ప్రజలు దీనిని పట్టించుకోవడం లేదు. ఇక ఓవరాల్‌గా హైదరాబాద్‌కు 429 ఏళ్లు నిండి 430వ యేడులోకి వస్తోందన్నమాట. సో హ్యాపీ బర్త్ డే హైదరాబాద్.