హాట్ యాంకర్ అనసూయకు తెలుగు ప్రేక్షకుల్లో, యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా చాలా యంగ్‌గా కనిపించడమే ఆమె స్పెషాలిటీ. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఫర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఇంత ముదరు వయస్సులో కుర్రకారును మత్తెక్కించడం అంటే మామూలు విషయం కాదు. ఇక అనసూయ బుల్లితెరపై మంచి డిమాండ్ ఉన్న యాంకర్. ఈ క్రమంలోనే ఆమె సంపాదన కూడా గట్టిగానే ఉందంటున్నారు.
ప్రస్తుతం ఆమె ఈటీవీలో నటిస్తోన్న జబర్దస్త్ షోతో కావాల్సినంత ఇమేజ్ తెచ్చుకుంది. అనసూయ ఆస్తి చాలా ఎక్కువే అని.. అందువల్లే ఆమెపై ఇటీవల ఐటీ రైడ్స్ కూడా జరిగాయని అంటున్నారు. అనసూయకు జూబ్లిహిల్స్‌లో రు. 10 కోట్ల విలువ చేసే ఇళ్లు ఉంది. అలాగే రు. కోటికి పైగా విలువ చేసే ఆడి కారుతో పాటు మరో రెండు కార్లు కూడా ఉన్నాయి. కరోనా లాక్డౌన్ వేళ కూడా ఆమె రెమ్యునరేషన్ ఎంత మాత్రం తగ్గలేదంటే ఆమెకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతోంది.
అనసూయ యేడాదికి రు. 5 కోట్లకు పైనే సంపాదిస్తోందట. ఎంత సంపాదించినా కూడా చాలా సింప్లిసిటీ మెయింటేన్ చేయడం అనసూయ గొప్పతనం. ఇక అనసూయ అటు బుల్లితెరపైనే కాదు.. ఇటు వెండితెరపై కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగాను.. హాట్ ఐటెం సాంగుల్లోనూ నటించి మెప్పిస్తోంది. విన్నర్లో ఐటెం సాంగ్, రంగస్థలంలో రంగమ్మత్త లాంటి పాత్రలు ఆమె కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించాయి.