అమ్మ రాజశేఖర్ డ్యాన్స్ మాస్టర్ నుంచి డైరెక్టర్‌గా మారాడు. లారెన్స్, ప్రభుదేవాల స్టైల్లోనే డ్యాన్స్ మాస్టర్‌గా ఎన్నో హిట్ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన మనోడు ఆ తర్వాత మెగా ఫోన్ పట్టాడు. ముందుగా గోపీచంద్ హీరోగా 2006లో వచ్చిన రణం సినిమాను డైరెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత రవితేజ – ఇలియానా కాంబోలో 2006లో ఖతర్నాక్ తీయగా అది డిజాస్టర్ అయ్యి రవితేజ ఇమేజ్ డ్యామేజ్ చేసింది.
ఆ తర్వాత నితిన్ – సదా కాంబోలో జయం స్థాయి హిట్ తీస్తానంటూ 2007లో టక్కరి సినిమా చేయగా అది కూడా ప్లాప్ అయ్యింది. 2009లో శశాంక్ – మధుశర్మ కాంబోలో తీసిన భీభత్సవం మాత్రం యావరేజ్ అయ్యింది. ఇక 2013లో కృష్ణుడు హీరోగా చేసిన మ్యాంగో కూడా డిజాస్టర్ అయ్యింది. చివరకు తానే హీరోగా మారి రణం 2 చేశాడు. ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్ కూడా నటించింది.
ఈ సినిమా కూడా ఘోరంగా తన్నేయడంతో చివరకు మనోడు దర్శకత్వానికి గుడ్ బై చెప్పేశాడు. పాపం రాజశేఖర్‌కు తొలి సినిమా రణం తప్పా ఆ తర్వాత ఒక్క హిట్టు కూడా రాలేదు. ఇప్పుడు బిగ్‌బాస్ 4 హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు.