Moviesఈ వారం బిగ్‌బాస్ ఎలిమినేష‌న్లో చీటింగేనా.. ఎక్కువ ఓట్లు వ‌చ్చిన ఆ...

ఈ వారం బిగ్‌బాస్ ఎలిమినేష‌న్లో చీటింగేనా.. ఎక్కువ ఓట్లు వ‌చ్చిన ఆ కంటెస్టెంట్ ఎలిమినేష‌నా..!

ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేష‌న్లో ఉన్న కంటెస్టెంట్ల లిస్ట్ చాలానే ఉంది. అరిచానా, అభిజిత్, మోనాల్‌, కుమార్ సాయి, దివి, అఖిల్‌, నోయ‌ల్‌, లాస్య‌, హారిక ఉన్నారు. వీరిలో అభిజిత్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాడు. ఇక ఈ వారం ఎలిమినేష‌న్ విష‌యానికి వస్తే కుమార్ సాయిని బ‌క‌రాను చేసి బ‌య‌ట‌కు పంపేస్తున్నార‌ట‌. బిగ్‌బాస్‌లో ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వెళ్లిన కంటెస్టెంట్లు సైతం త‌మ ఎలిమినేష‌న్ విష‌యంలో అనేక సందేహాలు ఉన్నాయ‌ని చెప్పారు.

 

వాస్త‌వానికి ఓటింగ్ ప‌రంగా చూస్తే మోనాల్ త‌క్కువ ఓట్ల‌తో ఈ వారం హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలి. మోనాల్ పులిహోర ప్రేమ‌లు, ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్‌, ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీలే ఇప్పుడు హౌస్‌కు కాస్త ఎట్రాక్ష‌న్‌. ఇక కుమార్ సాయి ముందు సైలెంట్‌గా ఉన్నా ఇప్పుడు బాగా పుంజుకున్నాడు. కంటెస్టెంట్ల‌తో గేమ్‌లోనూ, వాద‌న‌ల్లోనూ ఢీ అంటే ఢీ అంటున్నాడు. అయితే హౌస్‌లో ఇప్పుడు మిగిలిందే ఐదుగురు మ‌హిళా కంటెస్టెంట్లు వీళ్ల‌లో అరియానా, మోనాల్ ఓవ‌ర్ చేస్తుంటార‌న్న టాక్ ప్ర‌జ‌ల్లో వ‌చ్చేసింది.

 

ఈ క్ర‌మంలోనే వీళ్లిద్ద‌రి కంటే కుమార్ సాయి ఓటింగ్‌లో ముందు ఉంటాడ‌న్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తోన్న ఆ మ‌హిళా కంటెస్టెంట్లను కాపాడుకునే ప‌నిలో బిగ్‌బాస్ బిజీగా ఉన్నాడ‌ట‌. అందుకే మ‌రోసారి ప్ర‌జ‌ల ఓటింగ్‌ను చీట్ చేసి కుమార్‌సాయిని బ‌క‌రాను చేస్తూ అత‌డిని ఇంటికి పంపుతున్నార చ‌ర్చ సోష‌ల్ మీడియాలో న‌డుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news