ఐదు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తన తదుపరి ప్రాజెక్టును ఎట్టకేలకు ప్రకటించాడు. ముందుగా దగ్గుబాటి రానాతో హిరణ్యకశ్యప సినిమా తెరకెక్కిస్తానని చెప్పిన గుణశేఖర్ ఇప్పుడు తాజాగా ఈ సినిమా కంటే ముందు శాకుంతలం చేస్తానని ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.
మహాభారత ‘ఆదిపర్వ’లోని ఓ ప్రేమకథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరచిపోయినా.. మరపురాని ప్రేమకథ కావడంతో శాకుంతలంను గుణ ఎలా తెరకెక్కిస్తాడన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ ఉంది. ఈ సినిమా గురించి ఈ రోజు ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఈ సినిమాలో శాకుతల పాత్రకు పూజా హెగ్డేను సంప్రదిస్తే ఆమె ఏ మాత్రం ఆసక్తి చూపలేదని టాక్.
చివరకు గుణశేఖర్ అనుష్కను సంప్రదించడంతో ఆమె ఓకే చెప్పిందని సమాచారం. గతంలో అనుష్క రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవిగా నటించింది. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. గుణశేఖర్ వర్క్‌పై ఆసక్తితోనే అనుష్క ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పిందంటున్నారు. ఇటీవల సరైన హిట్లు లేని ముదురు భామ అనుష్కకు ఇది మంచి అవకాశం అయినా.. ఇప్పుడు ఈ సినిమాలో ఆమెను ప్రేక్షకులు ఈ వయస్సులో ఎలా రిసీవ్ చేసుకుంటారో ? చూడాలి.