ఆ రాష్ట్రం సీఎం అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేవలం రు. 10కే చీర, లుంగీ ఇచ్చే పథకం ప్రవేశ పెట్టారు. ఈ పథకం ప్రవేశ పెట్టిన సీఎం ఎవరో కాదు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. పేదల కోసం సరికొత్త కార్యక్రమం అమలు చేసే ప్లాన్‌లో భాగంగా హేమంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ఆహారం భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే రాష్ట్రంలోని అర్హత గల లబ్దిదారులకు ఇవి ఇస్తారు.
అంత్యోదయ అన్నా యోజన కింద అర్హత సాధించిన కుటుంబాలకు ఆరు నెలల వ్యవధిలో ఈ బట్టలు ఇస్తామని హేమంత్ తెలిపారు. ఇక హేమంత్ గత ఎన్నికల మేనిఫెస్టోలోనే పేదలకు ధోతీలు, చీరలు ఇస్తామని చెప్పింది. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని
సీఎం హేమంత్ చెప్పారు.