బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్ర సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 200లో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్‌కు ఊపిరి లూదింది. ఈ సినిమా అప్పట్లోనే 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడడంతో పాటు రు. 35 కోట్ల వసూల్లు సాధించి ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాలో చిరంజీవి అక్కలుగా నటించిన వారిలో వినయ ప్రసాద్ కూడా ఒకరు. వినయ కన్నడలో ఒకప్పుడు హీరోయిన్‌గా కూడా చేసింది. అయితే ఈ సినిమాలు హిట్ అవ్వకపోవడంతో చివరకు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో మంచి పాత్రలతో పాటు హిట్ సినిమాల్లో ఆమె నటించింది. పలు తెలుగు సినిమాల్లో అమ్మ, అక్క, చెల్లి, వదిన పాత్రల్లో ఆమె నటించి మెప్పించింది. ఇక వినయ ప్రసాద్ వ్యక్తిగత జీవితంకు వస్తే ఆమె కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో పుట్టి పెరిగింది. ఆమె ప్రముఖ కన్నడ దర్శకుడు వీఆర్కే ప్రసాద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ప్రసాద్ అనారోగ్యంతో పెళ్లయిన ఏడు సంవత్సరాలకే మృతి చెందాడు. దీంతో వినయ 2002లో జ్యోతి ప్రసాద్‌ను పెళ్లాడింది.
ప్రస్తుతం ఆమె బెంగళూరులో నివాసం ఉంటోంది. ఆమె తెలుగులో చివరి సారిగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించింది. వినయ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. ఆమె మాతృభాష కన్నడ కావడంతో ఆమె ఎక్కువగా కన్నడ సినిమాల్లోనే నటించింది. అలాగే కన్నడ, మళయాళంలో 18 సీరియల్స్‌లో కూడా నటించింది. ఆమె ప్రస్తుతం అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై కూడా నటిస్తోంది.