ఏపీలో అధికార వైఎస్సార్సీపీకి తాజా హైకోర్టు నిర్ణయం మరో షాక్‌లా ఉందని విశ్లేషకులు, మీడియా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు కేసుల విషయంలో హైకోర్టు తీర్పులు అధికార వైఎస్సార్సీపీకి మైనస్ అయ్యేలా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో తాజాగా హైకోర్టు నిర్ణయం కూడా వైసీపీకే ఎదురు దెబ్బలా ఉందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టులు, తీర్పులు, జడ్జిలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కొందరు పెడుతోన్న పోస్టుల కేసులను సీబీఐకు నేరుగా అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తున్నా విచారణ సాగుతోన్న తీరపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా చెప్పింది.
ఈ కేసు విచారణలో కూడా సీబీఐకు ఏపీ ప్రభుత్వం సహకరించాలని సూచించింది. అయితే ఇప్పటి వరకు ఎక్కువుగా హైకోర్టు తీర్పులు, నిర్ణయాలను వైసీపీ వాళ్లు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలే ఎక్కువుగా తప్పు పడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంలో హైకోర్టు ఇప్పటికే సీరియస్‌గా ఉండగా తాజా నిర్ణయం అధికార పార్టీ వర్గాలను మరింత ఇరుకున పెట్టినట్లయ్యిందన్న చర్చలు నడుస్తున్నాయి.