Gossipsర‌ణ‌బీర్ త‌ల్లి నీతూ డ్యాన్స్‌... ర‌ణ‌బీర్‌తో ఆలియా పెళ్లికి ముహూర్త‌మే..

ర‌ణ‌బీర్ త‌ల్లి నీతూ డ్యాన్స్‌… ర‌ణ‌బీర్‌తో ఆలియా పెళ్లికి ముహూర్త‌మే..

బాలీవుడ్ ప్రేమ జంట అయిన ర‌ణ్‌బీర్ క‌పూర్ – ఆలియా భ‌ట్ త్వ‌ర‌లోనే వివాహ బంధంతో ఒక్క‌టి అవుతార‌న్న వార్త‌లు బాలీవుడ్‌లో ఎప్ప‌టి నుంచో వ‌స్తున్నాయి. తాజాగా మ‌రోసారి ఈ వార్త‌లు మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ర‌ణ‌బీర్ క‌పూర్ త‌ల్లి నీతూ క‌పూర్ డ్యాన్స్ చేస్తోన్న వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకే రిహార్స‌ల్ చేస్తున్నార‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది.

 

 

ఈ స్టార్ క‌ఫుల్ పెళ్లి సంబ‌రాల్లో చేసే డ్యాన్స్ కోస‌మే నితూ క‌పూర్ ప్రాక్టీస్ చేస్తున్నార‌ని బాలీవుడ్‌లో కూడా వార్త‌లు వ‌స్తున్న‌నాయి. ఇవి జోరుగా వైర‌ల్ అవ్వ‌డంతో చివ‌ర‌కు క‌పూర్ కుటుంబ స‌భ్యులు స్పందించారు. ఈ యేడాది పెళ్లి వేడ‌క లేద‌ని.. వ‌చ్చే యేడాది ద్వితియార్థంలో వీరి పెళ్లి జ‌రిగే ఛాన్స్ ఉంద‌ని చెప్పారు. ర‌ణ‌బీర్ తండ్రి రిషీక‌పూర్ ఈ యేడాది ఏప్రిల్‌లో మృతి చెందిన సంగ‌తి విదిత‌మే.

 

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే యేడాది ద్వితియార్థం వ‌ర‌కు పెళ్లి ఉండ‌ద‌ని అంటున్నారు. ఇక‌ రణ్‌బీర్‌, అలియా భట్ ఇద్ద‌రు ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. దీంతో ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని అన్నారు. వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు చాలా సమయం పడుతుందని తేల్చేశారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news