ఎన్టీఆర్ కెరీర్‌కు బలమైన పునాది వేయడంతో పాటు ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే తిరుగులేని బ్లాక్‌బస్టర్ అయ్యింది. నూనుగు మీసాల వయస్సులోనే ఎన్టీఆర్ ఫ్యాక్షనిస్టుగా చేసిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్‌కు చిన్న వయస్సులోనే స్టార్ డమ్ వచ్చేలా చేసింది. 2002లో ఈ సినిమా రిలీజ్ అవ్వగా.. వివి. వినాయక్‌కు ఇది తొలి సినిమా. ఈ సినిమాతోనే వినాయక్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.
అయితే ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌కు మాస్ ఇమేజ్ రాగా. వినాయక్‌కు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత వినాయక్ బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి సినిమా చేశారు. ఆ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వాస్తవంగా ఎన్టీఆర్‌తో వినాయక్ చేసిన ఆది సినిమాయే బాలయ్యతో వినాయక్ చేయాలట. ముందుగా ఈ కథను ఇప్పటి మంత్రి కొడాలి నానితో కలిసి ఎన్టీఆర్‌కు చెప్పగా… ఎన్టీఆర్ ఓకే చెప్పడంతో చివరకు బాలయ్యతో ఆ సినిమా చేయడం కుదర్లేదు.
ఆది హిట్ అయ్యాక ఆ తర్వాత బాలయ్యతో తన రెండో సినిమాగా చెన్నకేశవరెడ్డి తీశారు. ఈ సినిమాలో బాలయ్య చాలా అందంగా ఉన్నాడని బాలయ్య భార్య వసుంధర చాలాసార్లు మెచ్చుకున్నారని వినాయక్ పలుమార్లు చెప్పేవారు. ఏదేమైనా ఎన్టీఆర్ కథను ఓకే చేసి ఉండకపోతే ఆది బాలయ్య ఖాతాలో పడేది.