ప‌త్తా లేకుండా పోయిన చ‌ర‌ణ్ హీరోయిన్‌… రీజ‌న్ ఇదే..!

ఇండ‌స్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వ‌స్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. అయితే స్టార్ హీరోలు, క్రేజీ హీరోల ప‌క్క‌న కూడా ఛాన్సులు వ‌చ్చినా వాటిని ఉప‌యోగించుకోలేని హీరోయిన్లు కొంత‌మంది ఉంటారు. ఈ లిస్టులోకే చేరుతుంది చిరుత హీరోయిన్ నేహాశ‌ర్మ‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిరుత సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ఆమెకు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వ‌చ్చింది. పైగా పూరి, చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన సినిమా హిట్ అయ్యాక ఆమె దానిని యూజ్ చేసుకుని మ‌రింత స్టార్ హీరోయిన్‌గా ఎదిగే ఛాన్స్ వ‌చ్చింది.

 

ఆ త‌ర్వాత ఒక‌టి రెండు మంచి ఛాన్సులు మీడియం రేంజ్ హీరోల పక్క‌న వ‌చ్చినా తాను పెద్ద సినిమాలే చేస్తానంటూ బెట్టు చేసింది. ఆ త‌ర్వాత ఆమె ఫిగ‌ర్ మెయింటైన్ చేయ‌క‌పోవ‌డంతో ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు వ‌రుణ్ సందేశ్ ప‌క్క‌న ఆమె చేసిన సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఆమె ఓ హీరోయిన్ అన్న విష‌య‌మే తెలుగు సినిమా ప‌రిశ్రమ మ‌ర్చిపోయింది.

 

ఆ త‌ర్వాత మూటా మ‌ల్లు స‌ర్దుకుని ముంబై చెక్కేసిన నేహ శ‌ర్మ మ‌ళ్లీ హీరోయిన్‌గా ఛాన్సులు ద‌క్కించుకోవాల‌ని అనేక స‌ర్జ‌రీలు చేయించుకుంది. దీంతో ఆమె ఫేస్ మ‌రింత కాంతి విహీనంగా మారింది. ఆ త‌ర్వాత బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినా అవి కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు. చాలా పోరాటాల త‌ర్వాత నేహ చేసిన ముబార‌క్‌, సోలో, తానాజీ, ఇల్లీగ‌ల్ సినిమాలు హిట్ అయ్యాయి.

 

 

దీంతో ఇప్పుడు మ‌ళ్లీ ఆమెకు అవ‌కాశాలు క్యూ కట్టాయి. ఏదేమైనా చ‌ర‌ణ్ ప‌క్క‌న తొలి సినిమా చేసినా ఆ త‌ర్వాత ఆమె మంచి సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చినా ఒప్పుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆమె తెలుగులో ఫెయిల్యూర్ హీరోయిన్ అయ్యింది.