పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఓ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో విసిగిపోయి దీక్షకు దిగారు. ఉండి నియోజకవర్గంలోని కాళ్ల మండలం సీసలిలో రోడ్లకు మరమ్మతులు చేయాలని ఆయన కొద్ది రోజులుగా సూచిస్తున్నా అధికారులు ఆయన సూచనలు పట్టించుకోవడం లేదు. దీంతో రామరాజు రోడ్లపై దీక్షక దిగడంతో పాటు అధికారులు అక్కడకు వచ్చి సమాధానం చెప్పేవరకు కదలనని చెప్పారు.
రోడ్లపై పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చాలని చెపుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే దీక్షకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు. పది రోజుల్లో రోడ్లు మరమ్మతులు పూర్తి చేస్తామని వారు హామీ ఇవ్వడంతో పాటు దీక్ష విరమించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎమ్మెల్యే రోడ్డుపైనే నిరసన దీక్ష చేపట్టారు.
ఎట్టకేలకు అధికారులు రోడ్లకు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాతే కొద్దిసేపటి క్రితం దీక్ష విరమించుకున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే దీక్ష సక్సెస్ అవ్వడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.