Newsవైర‌ల్ వీడియో:  ఆకాశంలో ఒకేసారి మూడు సూర్యుళ్లు

వైర‌ల్ వీడియో:  ఆకాశంలో ఒకేసారి మూడు సూర్యుళ్లు

ఆకాశంలో ఎన్నో వింత‌లు, విశేషాలు జ‌రుగుతూ ఉంటాయి. వీటిని చూస్తే మ‌నం షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలోనే చైనాలోని తుఖియాంగ్ న‌గ‌రంలో ఓ అద్భుతం జ‌రిగింది. ఖ‌గోళంలో జ‌రిగిన ఆ వింత‌లు, విశేషాలు చూసిన వారు షాక్ అయ్యారు. ఆ ప్రాంత ప్ర‌జ‌లు గ‌తంలో ఒకేసారి ఐదుగురు సూర్యుళ్లు ఖ‌గోళంలో వ‌చ్చిన వింత చూశారు. తాజాగా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒకేసారి గ‌గ‌న‌తలంలో ముగ్గురు సూర్యుళ్లు వ‌చ్చిన వింత చూశారు.  దీనిని ఖ‌గోళ ప‌రిభాష‌లో స‌న్‌డాగ్ అని పిలుస్తారు.

 

తుఖియాంగ్‌లో మూడు గంట‌ల పాటు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఉద‌యం 6.30 గంట‌ల‌కు మొద‌లైన ఈ అద్భుతం 9.30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే మ‌ధ్య‌లో ఉన్న సూర్యుడు మాత్ర‌మే నిజ‌మైన సూర్యుడు. సూర్యుడుకు అటు, ఇటు ఉన్న సూర్యుళ్లు సూర్యుడికి ఉన్న ప్ర‌తిరూపాలు మాత్ర‌మే. వీటిని ఫాంట‌మ్ సూర్యూళ్లు అని పిలుస్తుంటారు. ఇవి ఎక్కువుగా ఈశాన్య చైనాలో ఆవిష్కృత‌మ‌వుతాయి.

 

సూర్యుడు చుట్టూ అప్పుడ‌ప్పుడు ఏర్ప‌డే ప్ర‌తి బింబాలు కూడా సూర్యుడిలా ఉంటాయి. ఒక్కోసారి అటు రెండు, ఇటు రెండు సూర్య ప్ర‌తిబింబాలు ఏర్ప‌డితే అప్పుడు మొత్తం ఐదు సూర్యుళ్లు ఉన్న‌ట్టు అవుతుంది. ఈ వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news