తెలంగాణ రాజధాని హైదరాబాద్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. రెండు జంట నగరాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. ఓ వైపు నగర వ్యాప్తంగా ఉన్న నాలాలు భయంకరంగా పొంగి పొర్లుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. పాత బస్తీ అయితే పూర్తిగా నీట మునిగిపోయింది. రోడ్లు అయితే పెద్ద పెద్ద కాల్వలను మరపిస్తున్నాయి.
రోడ్ల వెంట వెళుతోన్న నీరు అయితే పెద్ద పెద్ద కాల్వల్లాగానే ఉంది. ఈ క్రమంలోనే పాతబస్తీలో ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. పాల్లె చెరువు పూర్తిగా నిండిపోవడంతో పాత బస్తీ అంతా చెరువు అయిపోయింది. ఆ వ్యక్తి రోడ్డు మీద ప్రవాహంలో వేగంగా కొట్టుకుపోతోన్న దృశ్యాలు అక్కడ ఉన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
నీటిలో కొట్టుకుపోతోన్న వ్యక్తిని తాళ్ల సాయంతో స్థానికులు బయటకు లాగుదామని ప్రయత్నించినా ప్రవాహ వేగానికి అతడు కొట్టుకుపోయాడు. ఆ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా, గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.