MoviesR R R ఫ్యాన్స్‌కు మళ్లీ షాక్‌... షూటింగ్ క్యాన్సిల్‌.. ఈ...

R R R ఫ్యాన్స్‌కు మళ్లీ షాక్‌… షూటింగ్ క్యాన్సిల్‌.. ఈ సారి విల‌న్ ఎవ‌రంటే..!

భార‌తీయ సినీ ప్రేమికులు ఎన్నో ఆశ‌ల‌తో వెయిట్ చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎట్ట‌కేల‌కు ఏడు నెల‌ల త‌ర్వాత ప్రారంభ‌మైంద‌ని సంబ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నాలుగు రోజులు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో విశ్రాంతి కోర‌డంతో ఈ షూటింగ్ ఓ వారం రోజులు వాయిదా ప‌డుతుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఎన్టీఆర్ విశ్రాంతి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే మ‌రో రెండు, మూడు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌నుకుంటున్న టైంలో మ‌రో సారి ఈ సినిమా షూటింగ్ ప‌ది, ప‌దిహేను రోజులు వాయిదా ప‌డేలా ఉంది.

 

 

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల‌ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ భారీ వ‌ర్షం ప్ర‌భావం ఏపీతో పాటు తెలంగాణ అంతానే కాకుండా గ్రేట‌ర్ హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌పై చాలా ఎక్కువుగా ఉంది. హైద‌రాబాద్‌లో వ‌ర్ష‌పు నీరుతో రోడ్లే కాలువ‌ల్లా మారాయి. దీంతో మీడియం రేంజ్‌, పెద్ద సినిమాల షూటింగ్‌లు మ‌ళ్లీ నిలిచిపోతోన్న ప‌రిస్థితి. భారీ బ‌డ్జెట్ కావ‌డంతో పాటు ఓపెన్ ప్లేసులో షూటింగ్ చేయాల్సి ఉన్నందున ఇప్ప‌ట్లో వ‌ర్షం త‌గ్గే వ‌ర‌కు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభించ‌డం క‌ష్ట‌మే అని చెపుతున్నారు.

 

దీనికి తోడు భారీ వ‌ర్షాల‌తో హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో షూటింగులకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రొడక్షన్ హౌస్‌లు చెప్పాయి. ఈ సారి ఆర్ ఆర్ ఆర్ పాలిట వ‌రుణ దేవుడు విల‌న్ అయ్యాడ‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news