సురేష్‌కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ బాషా సినిమా సౌత్ ఇండియాలోనే అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమా ఎలా తెరకెక్కింది ? దీని వెనక ఉన్న కథేంటో తెలిస్తే షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. రజనీ 1991లో అమితాబ్ నటించిన హిందీ మూవీ హయ్‌లో ఓ హీరోగా చేశారు. ఆ సినిమాలో గోవిందాకు జాబ్ ఇప్పించే సీన్ ఒకటి ఉంటుంది. అయితే అది ఎడిటింగ్‌లో తీసేశారు. అది రజనీకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది.
ఆ సీన్ చూపించి అన్నామలై షూటింగ్ సమయంలో దాని ఆధారంగా కథ రెడీ చేయమని దర్శకుడు సురేష్ కృష్ణను అడిగారు. చివరకు రజీని నిజజీవిత క్యారెక్టర్ అయిన బస్ కండెక్టర్ లైన్‌ను ఆటో డ్రైవర్‌గా మార్చారు. 1994లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నగ్మా హీరోయిన్. రఘువరన్ విలన్, దేవా మ్యూజిక్ డైరెక్టర్. 1995 జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇంటర్వెల్ ముందు వరకు ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఇంటర్వెల్ తర్వాత ఓ డాన్‌గా మారిపోవడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ లెవల్లో ఉందన్న ప్రశంసలు వచ్చాయి.
ఒక్కసారి బాషా చెపితే వందసార్లు చెప్పినట్టు లాంటి డైలాగులు బాగా పేలాయి. రజనీని తిరుగులేని సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత నార్త్‌లో చాలా మంది ఆటోడ్రైవర్లు తమ ఆటోలకు రజనీ ఫొటో వేయించుకున్నారు. సురేష్‌కృష్ణ మోస్ట్‌వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ అల్లు అరవింద్ కొనాలనుకున్నా బేరం కుదర్లేదు.. దీంతో డబ్బింగ్ రైట్స్ రు. 80 లక్షలకు వేరే వాళ్లు కొన్నారు. అప్పటి వరకు రు. 25 లక్షల డబ్బింగ్ రైట్స్ ఏకంగా రు. 80 లక్షలకు చేరుకోవడం ఓ రికార్డు.
తెలుగులో 200 సెంటర్లలో రిలీజ్ అయ్యి 100 సెంటర్లలో 50 రోజులు ఆడింది. 50 సెంటర్లో 100 రోజులు ఆడింది. 6 సెంటర్లలో 175 రోజులు ఆడి చరిత్రలో నిలిచిపోయింది.