సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బాల్య స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ఈ నెలాఖరులో పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఆమె గౌతమ్‌ను పెళ్లాడనుంది. పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే ఆమె ఒప్పుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే కాజల్ పెళ్లి చేసుకోనుండడంతో ఆమె అభిమానులు మిస్ యూ కాజల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు పెళ్లి తర్వాత మీరు సినిమాలు చేస్తారా ? ముందు మీ ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేశారంటూ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.
అయితే ఓ నెటిజన్ మాత్రం కాజల్‌కు షాకింగ్ ప్రశ్న వేశాడు. గౌతమ్ కిచ్లూ, కాజల్ ఆస్తుల విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రశ్నలకు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. కాజల్ యేడాదికి రు. 5 కోట్లు సంపాదించి ఉంటుందని.. ఇప్పటి వరకు ఆమె ఆస్తులు వందల కోట్లలోనే ఉంటాయని చెపుతున్నారు.
మరికొందరు మాత్రం గౌతమ్ ఆస్తులు ఓవరాల్‌గా ఆయన వ్యాపారాలను బట్టి చూస్తే రు. 50 – 70 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఉంటాయంటున్నారు. నెటిజన్ల అభిప్రాయాలు ఇలా ఉంటే కాజల్ ఫ్యాన్స్ మాత్రం 20 రోజుల్లో పెళ్లి ఉంటే మీకు ఈ ఆస్తుల పంచాయితీలు ఎందుకంటి అని ప్రశ్నిస్తున్నారు.