ఓ 16 ఏళ్ల బాలిక దేశానికి ప్రధాని అయ్యి ప్రపంచంలోనే పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఫిన్లాండ్ దేశానికి 16 ఏళ్ల బాలిక బుధవారం ఉదయం ఈ బాధ్యతలు చేపట్టింది. ఆమె బాధ్యతలు చేపట్టిన వెంటనే కేబినెట్ మంత్రులు, చట్టసభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించింది. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ నెల 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి గర్ల్ టేకోవర్ కార్యక్రమం నిర్వహించింది.
ఇందులో భాగంగా దక్షిణ ఫిన్లాండ్‌లో వాక్సే గ్రామానికి చెందిన ఆవా ముర్టో (16) ఒక్క రోజు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించింది. స్త్రీ-పురుష సమానత్వం అన్న కోణంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ఇందులో ప్రధాని అయిన బాలిక ముర్టోతో పాటు ఫిర్లాండ్ ప్రధాని సనా మారిన్ కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం వారిద్దరు కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు ఆన్‌లైన్లో కూడా వేధింపులు ఎక్కువ అవుతున్నాయని.. దీనికి పరిష్కారం చూపాలని కోరారు. ఇక ఫిన్లాండ్‌లో చాలా సంస్థలు సైతం తమ బాధ్యతలను అన్నింటిని ఒక్క రోజు మహిళలకే అప్పగించాయి.