బిగ్‌బాస్ 4.. నిన్న క‌రాటే క‌ల్యాణి అవుట్‌.. ఈ రోజు ఎలిమినేష‌న్ ఎవ‌రంటే..

బిగ్‌బాస్‌లో ఈ వారం హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల‌కు డ‌బుల్ షాక్ ఇచ్చాడు. ఈ వారం ఎలిమినేష‌న్లో మొత్తం 9 మంది స‌భ్యులు ఉన్నారు. శ‌నివారం రాత్రి జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ముందుగా గంగ‌వ్వ సేఫ్ అయినట్టు ప్ర‌క‌టించాడు. ఇక క‌రాటే క‌ల్యాణిని ఎలిమినేట్ చేశాక‌.. ఈ వారం డ‌బుల్ ఎలిమినేన్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు. ఆదివారం ఎవ‌రు ? ఎలిమినేట్ అవుతారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

 

ఇంకా ఎలిమినేష‌న్లో ఉన్న వారిలో మోనాల్ గజ్జర్, అమ్మరాజశేఖర్, అభిజీత్, హారిక, నోయెల్, సోహైల్, కుమార్ సాయి ఉన్నారు. వీరిలో ఆదివారం కుమార్ సాయి ఎలిమినేట్ కావొచ్చ‌న్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో ఎక్కువుగా జ‌రుగుతోంది. టాస్క్‌ల్లో పెద్ద‌గా ఆక‌ట్టుకోక‌పోవ‌డం ఒక మైన‌స్ అయితే.. ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌డం.. ఎవ‌రితోనూ క‌ల‌వ‌క‌పోవ‌డం అత‌డికి పెద్ద మైన‌స్ అయ్యింది.

 

ఈ క్ర‌మంలోనే అత‌డికి చాలా త‌క్కువ ఓట్లు ప‌డ్డాయంటున్నారు. బ‌య‌ట ప్రైవేటు పోల్స్‌లోనే అత‌డికి త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. మ‌రి ఫైన‌ల్‌గా అంద‌రూ అంచ‌నా వేసిన‌ట్టే కుమారి సాయి ఎలిమినేట్ అవుతాడా ?  లేదా ఎలిమినేష‌న్ నుంచి ఎస్కేప్ అవుతాడా  ? అన్న‌ది చూడాలి.

Leave a comment