గుడ్ న్యూస్‌… టిక్‌టాక్‌పై బ్యాన్ ఎత్తేశారు..

చైనాకు చెందిన ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాప్ టిక్‌టాక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నుంచి నిషేధం అమ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం నుంచి అమెరికాలో టిక్ టాక్ ఉండ‌ద‌ని నిరాశ‌తో ఉన్న అమెరిక‌న్ల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. టిక్ టాక్‌, వీ చాట్‌ల‌పై నిషేధం విధించాల‌నుకున్న ట్రంప్ కాస్త వెన‌క్కి త‌గ్గారు. అమెరికాలో బ‌హుళ‌జాతి కంప్యూట‌ర్ టెక్నాల‌జీ సంస్థ అయిన ఒరాకిల్‌తో జోడీ క‌ట్టేందుకు టిక్ టాక్‌ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

 

అమెరికాలో జాయింట్‌గా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు ఒరాకిల్‌ను టిక్ టాక్ ఎంచుకుంది. టిక్‌టాక్‌, ఒరాకిల్‌ మధ్య డీల్‌కు అమెరికా ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఆమోదముద్ర పడనుంది. దీనిపై ట్రంప్‌ ఇదివరకే తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ట్రంప్ గ‌త నెల‌లోనే అమెరికా టిక్ టాక్ బిజినెస్‌ను అమెరికా సంస్థ‌కు అమ్మ‌క‌పోతే తాము సెప్టెంబ‌ర్ 20 నుంచి నిషేధం విధిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

Leave a comment