అన్‌లాక్ 4.0ల కూడా థియేటర్లు తెరచుకోలేదు. ఓ వైపు కరోనా తగ్గడం లేదు. దసరాకు థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. ఇక సంక్రాంతికి అంటున్నా అప్పటకి అయినా థియేటర్లె తెరచుకుంటాయన్న గ్యారెంటీ అయితే లేదు. మరోవైపు ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్లు తెరచుకోలేక లాక్ అయిపోయాయి. షూటింగ్‌లు బ్రేక్ అయ్యాయి. అయితే షూటింగ్‌లు కంప్లీట్ అయిన సినిమాకు ఇప్పుడు ఓటీటీ పెద్ద వరంగా మారింది. రాంగోపాల్ వర్మ సినిమాల నుంచి మొదలు పెడితే నాని వీ సినిమా వరకు అన్ని ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి.
ఇక ఈ లిస్టులోనే అనుష్క నిశ్శబ్దం కూడా ఉంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ సైతం ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయట. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరో మాస్టర్ సినిమాకు అమోజాన్ ప్రైమ్ నుంచి డీల్ కుదిరే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ క్రమంలోనే అమోజాన్ వాళ్లు వకీల్‌సాబ్‌కు కోసం ఆ సినిమా నిర్మాత దిల్ రాజుకు ఓ ప్రపోజల్ పెట్టినట్లుగా తెలిసింది. అయితే దిల్ రాజు దీనికి ఒప్పుకోవడం లేదని ఇండస్ట్రీ టాక్..?
రు. 80 కోట్లు వకీల్‌సాబ్ కోసం అమోజాన్ వాళ్లు ఆఫర్ పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది పైకి పెత్త మొత్తంగా కనపడుతున్నా సినిమా హిట్ అయితే పవన్ స్టామినా ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే రాజు ఈ సినిమాపై భారీగా పెట్టుబడులు పెట్టి ఉన్నాడు. దీంతో రాజు మాత్రం కాస్త లేట్ అయినా థియేటర్లు తెరిచాకే వకీల్‌సాబ్‌ను రిలీజ్ చేయాలని చూస్తున్నాడట.