నేచురల్ స్టార్ నాని – సుధీర్‌బాబు జంటగా నటించిన వి సినిమా ఈ రోజు అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది. మార్చి 25న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలు వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ రోజు అమెజాన్ డిజిటల్ స్ట్రీమింగ్‌లో రిలీజ్ అయ్యింది. వీ అలా రిలీజ్ అయ్యిందో లేదో వెంటనే పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలతో సహా.. ఇటీవల ఓటీటీల్లో వచ్చిన పలు తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయిన తొలి రోజే ఫైరసీ భారీన పడ్డాయి. ఇప్పుడు వీ కూడా ఫైరసీ కాటుకు బలైంది.
యాక్షన్ థ్రిల్లర్ కావడంతో నిర్మాత దిల్ రాజు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టాడు. ముందు ఓటీటీ భేరసారాలకు రాజు ఏ మాత్రం లొంగలేదు. చివరకు థియేటర్లు ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఓటీటీలోనే రిలీజ్ చేశారు. రాజుకు ఓటీటీకి ఇచ్చాశాక ఆయనకు సంబంధం లేకపోయినా ఫైరసీలో వచ్చేయడం మాత్రం ఓటీటీ వాళ్లకు పెద్ద దెబ్బే. పైగా సినిమాకు టాక్ కూడా పెద్దగా బాగోలేదు. అయితే ఆ ఇంఫాక్ట్ వ్యూస్‌పై పడి పరోక్షంగా నానికి కూడా అది మైనస్ కానుంది.
చాలా క్వాలిటీ ఫ్రింట్ ఫైరసీ సైట్లలో వచ్చేయడంతో నాని కూడా కంగారు పడడంతో పాటు పైరసీని ఎవ్వరూ ఎంకరేజ్ చేయవద్దని పిలుపు ఇచ్చారు. గత రాత్రి సినిమా రిలీజ్ అయితే తెల్లారేసరికే ఫైరసీ ప్రింట్ వచ్చేసింది. ఏదేమైనా తొలి రోజే వీ సినిమా టీంకు పెద్ద దెబ్బ అని చెప్పాలి.