Newsఅన్‌లాక్ 4: రైలు ప్ర‌యాణికులు ఈ ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే... రూల్స్...

అన్‌లాక్ 4: రైలు ప్ర‌యాణికులు ఈ ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే… రూల్స్ ఇవే

అన్‌లాక్‌–4లో భాగంగా ప్రకటించిన విధంగా శనివారం నుంచి ప్ర‌త్యేక రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇక ప్ర‌స్తుతం న‌డుస్తోన్న రైళ్ల‌లో సైతం కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలి. కోవిడ్ క‌ట్ట‌డిలో భాగంగా కేంద్ర‌ ఆరోగ్య సంక్షేమ శాఖ, హోం మినిస్ట్రీ సూచించిన ఈ నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంది. ఈ నిబంధ‌న‌లు ఇలా ఉన్నాయి..

– కేవ‌లం క‌న్ఫార్మ్ టిక్కెట్లు ఉన్న ప్ర‌యాణికులను మాత్ర‌మే రైలు ఎక్కేందుకు స్టేష‌న్‌లోకి అనుమ‌తి ఇస్తారు.
– ప్ర‌యాణికులు రైలు ఎక్కేట‌ప్పుడు ఖ‌చ్చితంగా మాస్క్‌తో పాటు ఫేస్‌ షీల్డ్‌ ఉపయోగించాలి.
– ఇక ధ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌ని స‌రికావ‌డంతో ముందుగా స్టేష‌న్‌కు చేరుకుని.. క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని డిసైడ్ అయ్యాకే ప్ర‌యాణానికి అనుమ‌తి ఇస్తారు.

 

– ఇక ప్ర‌తి ఒక్క‌రు స్టేష‌న్ల‌లో గ్యాప్ పాటిస్తూ భౌతిక దూరం పాటించాలి. గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లాక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్త్ ప్రొటోకాల్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. ఇక ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేసేట‌ప్పుడు త‌మ సొంత బ్లాంకెట్స్ వెంట తెచ్చుకోవాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news