ఇద్ద‌రు వైసీపీ ఎంపీల‌కు క‌రోనా పాజిటివ్‌… ఆ లేడీ ఎంపీకి కూడా…

ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీలు కోవిడ్ భారీన ప‌డ్డారు. నిన్న‌టికి నిన్న కాకినాడ ఎంపీ వంగా గీత కోవిడ్ భారీన ప‌డ‌గా.. ఈ రోజు మ‌రో ఇద్ద‌రు ఎంపీల‌కు సైతం క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్పకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. పార్ల‌మెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన రెడ్ప్ప‌కు ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా నిర్దార‌ణ కావ‌డంతో ఆయ‌న్ను ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

 

అరకు వైసీపీ ఎంపీ మాదవికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె కూడా ప్ర‌స్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. ఆమె క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆమె రెండు వారాల పాటు ఢిల్లీలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అరకు ఎంపీ మాధవి కోరారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.