Gossipsవైఎస్‌.జ‌గ‌న్‌గా నాగార్జున‌.. యాత్ర 2 వ‌చ్చేస్తోంది.. !

వైఎస్‌.జ‌గ‌న్‌గా నాగార్జున‌.. యాత్ర 2 వ‌చ్చేస్తోంది.. !

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా మ‌హి వి .రాఘ‌వ్ యాత్ర సినిమా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌డు ఆ సినిమా హిట్ అవ్వ‌డంతో మ‌హి యాత్ర 2 తెర‌కెక్కించేందుకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక వైఎస్ పాద‌యాత్ర‌లో 2003 నుంచి ప్రారంభ‌మై ఆయ‌న సీఎం అయ్యే వ‌ర‌కు ఉన్న క‌థాంశంతో యాత్ర తెర‌కెక్కితే… ఇప్పుడు జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఉన్న క‌థ‌తో యాత్ర 2 ప్రారంభ‌మై జ‌గ‌న్ సీఎం అయ్యి.. సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు ఎలా అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడ‌న్న క‌థాంశంతో యాత్ర 2 ఉంటుంద‌ని తెలుస్తోంది.

 

ఈ సినిమాలో జ‌గ‌న్ పాత్ర‌ను కింగ్ నాగార్జున పోషిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాల‌కు కూడా నాగార్జున ప్ర‌చారం చేసిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జున‌కు, జ‌గ‌న్‌కు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు యాత్ర 2 సినిమాలో జ‌గ‌న్ పాత్ర పోషించేందుకు నాగ్ ఓకే చెప్పాడ‌ట‌. మ‌రి ఈ సినిమా రాజ‌కీయంగా, ఇటు సినిమా ప‌రంగా ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ?  చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news