టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డిని విచారిస్తోన్న క్రమంలో పోలీసులు పలు కీలక విషయాలు గుర్తించారు. దేవరాజ్ రెడ్డి టిక్ టాక్ పేరుతో ఎంతో మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడని గుర్తించారు. ఒక అమ్మాయికి తెలియకుండా మరో అమ్మాయితో దేవరాజ్ ప్రేమాయణం నడిపాడు. ఈ క్రమంలోనే టిక్ టాక్ పేరుతోనే శ్రావణికి దగ్గరై ఆమెను కూడా ప్రేమిస్తున్నట్టు నమ్మించాడు. ఆ తర్వాత ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీశాడు.
తర్వాత వాటిని శ్రావణి చూసి నిలదీయగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తర్వాత అదే వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పదే పదే డబ్బు గుంజాడు. అయితే తనతో పాటు మరికొంతమంది యువతులతో ప్రేమాయణం నడిపినట్టు శ్రావణి గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇక తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు తనకు తెలియకుండానే దేవరాజ్ వీడియోలు, ఫోటోలు తీసిన విషయాన్ని ఆమె ఆలస్యంగా గుర్తించింది.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక దేవరాజ్‌పై ఆమె ఈ ఏడాది జూన్‌లో దేవరాజ్‌పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ శ్రావణి, దేవరాజ్ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చివరకు మళ్లీ బెదిరింపులకు దిగడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.