బ్రేకింగ్‌: కేసీఆర్ రైట్ హ్యాండ్‌, టీఆర్ఎస్ కీల‌క నేత మృతి

క‌రోనాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు బ‌ల‌వుతోన్న ప‌రిస్థితి. తాజాగా తెలంగాణ‌లో అధికార పార్టీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత క‌రోనాతో మృతి చెందారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, 2009 లో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఎం. సుద‌ర్శ‌న్ రావు మృతి చెందారు. కొద్ది రోజుల క్రిత‌మే ఆయ‌న క‌రోనా భారీన ప‌డ‌డంతో ఆయ‌న గ‌చ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు.

 

 

ఇక ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో అదే హాస్ప‌ట‌ల్లో మృతిచెందారు. సుద‌ర్శ‌న్ రావు సీఎం కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయ‌న కేసీఆర్ వెంటే ఉన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆయ‌న పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2009లో ఆయ‌న కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌పై పోటీ చేసి ఓడిపోయారు.