Newsవెల్లంప‌ల్లి కాదు... వెల్లుల్లిపాయ్‌.. ఆ వీడియోతో ఆడుకుంటున్నారుగా..

వెల్లంప‌ల్లి కాదు… వెల్లుల్లిపాయ్‌.. ఆ వీడియోతో ఆడుకుంటున్నారుగా..

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు అన్ని తూర్పు గోదావ‌రి జిల్లాలోని అంత‌ర్వేది ర‌థం ద‌హ‌నం చుట్టూనే తిరుగుతున్నాయి. తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో దిగి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ చివ‌ర‌కు ఈ విష‌యాన్ని సీబీఐకి అప్ప‌గిస్తూ ఈ రోజు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ అంశంపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకు ప‌డ్డారు. ప‌వ‌న్ ఎన్నికలకు ముందు తన పిల్లలు క్రిస్ట్రియన్స్ అని… ఇప్పుడు హిందువును అని చెపితే ఎవ‌రు న‌మ్ముతారంటూ ఎద్దేవా చేశారు.

 

 

 

సినిమాల్లో వేషం వేసినట్టు ఇక్క‌డ వేషం వేస్తే కుద‌ర‌ని చెప్పారు. అయితే వెల్లంప‌ల్లికి జ‌న‌సేన సైనికులు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన పాత వీడియోలు షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు పాత విష‌యాలు మ‌ర్చిపోతే ఎలా మంత్రి గారు అని ప్ర‌శ్నిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తమ అధినేత పవన్ కళ్యాణ్‌ను మీడియా ముందు అన్న నా గురించి ఒకసారి మాట్లాడవా అంటూ బ‌తిమిలాడిన రోజులు మ‌ర్చిపోయావా ? అని ప్ర‌శ్నిస్తున్నారు.

 

 

 

దీనికి సంబంధించి ఓ న్యూస్ ఛాన‌ల్ స్టోరీ ట్వీట్ చేస్తున్నారు.  మ‌రి కొంద‌రు పాపం వెల్లుల్లిపాయ్‌.. మంత్రి వెల్లంప‌ల్లి జ‌న‌సైనికుల దెబ్బ‌కు ఇలా అయిపోతావ‌ని అనుకోలేదు స్వామి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు, కామెంట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news