Moviesబిగ్‌బాస్ 4: ఈ వారం ఇద్ద‌రు ఎలిమినేష‌న్‌... ఎవ‌రా ఇద్ద‌రు..!

బిగ్‌బాస్ 4: ఈ వారం ఇద్ద‌రు ఎలిమినేష‌న్‌… ఎవ‌రా ఇద్ద‌రు..!

బిగ్‌బాస్ 4వ సీజ‌న్ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైన ఈ షోలో హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్ల‌ను నేరుగా పంపిన బిగ్‌బాస్ అరియానా గ్లోరీ, స‌య్య‌ద్ సోహైల్‌ను ఓ సీక్రెట్ రూంలో ఉంచి ఆ త‌ర్వాత హౌస్‌లోకి పంపాడు. ఇక ఈ వారం ఎలిమినేష‌న్లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేష‌న్‌లో ఎవ‌రు ఉంటారు ? అన్న‌ది ఇప్ప‌టికే స‌స్పెన్స్‌గా ఉండ‌గా.. బిగ్‌బాస్ వారాంతంలో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ సీజ‌న్లో కంటెస్టెంట్లు వీక్ అన్న విమ‌ర్శ‌లు రావ‌డంతో రేటింగులు కూడా ఆశించిన‌ట్టుగా రావ‌డం లేద‌ట‌. ఈ క్ర‌మంలోనే మ‌రో ఇద్ద‌రు కంటెస్టెంట్ల‌ను ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి పంపుతున్నార‌ని టాక్‌. అయితే ఈ వారం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఇద్ద‌రు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతార‌ని అంటున్నారు. మూడో సీజ‌న్లో తొలి వారం హేమ బ‌య‌ట‌కు వ‌స్తే..  ట్రాన్స్ జెండ‌ర్‌ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీజ‌న్లో ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తార‌ని అంటున్నారు.

 

స్వాతి దీక్షిత్, జబర్దస్త్ ముక్కు అవినాష్, ఈరోజుల్లో ఫేం శషికుమార్ ఈ ముగ్గురు బిగ్ బాస్ హౌజ్ లో వైల్డ్ కార్డ్ గా వస్తారని అంటున్నారు. ఆల్రెడీ వీరిని బిగ్ బాస్ నిర్వహాకులు 16 రోజులు క్వారెంటైన్ లో ఉంచారని తెలుస్తుంది. ఏదేమైనా తొలి వారంలోనే ఇద్ద‌రు ఎలిమినేట్ అంటే ఈ సారి షోలో కంటెస్టెంట్ల‌కు షాకే అనుకోవాలి. ఇద్ద‌రు ఎలిమినేష‌న్లో ఉన్నారంటే దివి, డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్‌, అఖిల్‌లలో ఎవ‌రో ఇద్ద‌రు కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వెళ‌తార‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news