Gossipsత్రివిక్ర‌మ్ కోసం తార‌క్ డేరింగ్ డెసిష‌న్‌

త్రివిక్ర‌మ్ కోసం తార‌క్ డేరింగ్ డెసిష‌న్‌

ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఆ వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో స్టార్ హీరోలు అంద‌రూ క‌రోనాకు భ‌య‌ప‌డి షూటింగ్‌ల‌కు దిగాలంటేనే భ‌య‌ప‌డుతోన్న ప‌రిస్థితి. అస‌లు షూటింగ్‌లు ఎప్ప‌టి నుంచి మొదలు పెట్టాలి ? అనే విష‌యంలో చాలా మందికి ఇంకా క్లారిటీ లేదు. అదిగో ఇదిగో అంటున్నా ఇంకా ఒక్క పెద్ద హీరో సినిమా కూడా సెట్స్‌మీద‌కు వెళ్ల‌లేదు.

Jr NTR to join hands with Trivikram Srinivas for his 30th film - Movies News

చిరంజీవి, మ‌హేష్‌బాబు సినిమాలు సెట్స్ మీద‌కు వెళ‌తాయ‌ని అంటున్నా ఏ ఒక్క‌రు ముందుకు రావ‌డం లేదు. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం వేగంగా సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ మ‌రీ లేట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఈ లోగా త్రివిక్ర‌మ్ సినిమాను ప‌ట్టాలెక్కించేయాల‌ని డిసైడ్ అయిపోయాడ‌ట‌. ఆర్ ఆర్ ఆర్ వ‌చ్చే యేడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే రాజ‌మౌళి ఇప్ప‌ట్లో షూటింగ్ మొద‌లు పెట్టే ఛాన్సులు కూడా లేవు.

Trivikram and Jr NTR collaboration confirmed; upcoming film will start  rolling from March - Entertainment News , Firstpost

ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు మ‌రింత స‌మ‌యం ప‌డితే ఈ లోగా త్రివిక్ర‌మ్ సినిమా కోసం రెండు, మూడు షెడ్యూల్స్ అయినా ఫినిష్ చేసేయాల‌ని తార‌క్ భావిస్తున్నాడ‌ట‌. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే స్క్రిఫ్ట్ రెడీ చేసుకుని ఖాళీగా ఉంటున్నాడు. ఈ లోగా ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తే ఎంతో కొంత షూటింగ్ ఫినిష్ చేసేయాల‌న్న‌దే మ‌నోడి ప్లాన్‌. ఇటు తార‌క్ కూడా క‌రోనా ఉన్నా షూటింగ్‌కు రెడీగా ఉండ‌డంతో ఆర్ ఆర్ ఆర్‌తో స‌మాంత‌రంగా త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు.

Latest news