టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేసే మహేష్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అనంతపురం జిల్లా మడకశిర పోలీస్‌స్టేషన్ ఎదుట ఈ ఘటన జరిగింది. మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన మహేష్ డైరెక్టర్ కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు.
మహేష్ అన్నను ఈ నెల 8న పోలీసులు అరెస్టు చేశారు. మహేష్ అన్న కర్నాటక నుంచి అక్రమంగా మద్యం తెచ్చి అమ్ముతున్నాడని పోలీసులు ఇంటికి వచ్చి గలాటా చేశారని.. దీంతో తన పెళ్లి ఆగిపోయిందని మహేష్ చెపుతున్నాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేసిన మహేష్ వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు.