ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను ఇప్పటికే భారత్బ్యాన్ చేసింది. భారత్ లాంటి పెద్ద మార్కెట్ ఉన్న దేశంలో బ్యాన్ పడడంతో టిక్‌టాక్ విలవిల్లాడిపోతోంది. ఇక భారత్‌తో పాటు పలు దేశాలు సైతం ఇప్పటికే ఈ యాప్‌పై బ్యాన్ విధించాయి. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌కు మరో అదిరిపోయే షాక్ తగిలింది. టిక్‌టాక్‌ను అమెరికాలో బ్యాన్ చేసేశారు. ఆ దేశంలో కూడా ఈ యాప్ కథ ముగిసింది. గత కొంత కాలంగా చైనాపై గుర్రుగా ఉన్న అమెరిక అధ్యక్షుడు ట్రంప్ ఈ యాప్ వల్ల అమెరిక భద్రతకు ప్రమాదం ఉందని చెప్పడంతో పాటు ఈ యాప్ అమెరికా కార్యకలాపాలు అమెరికా సంస్థకు అమ్మేయాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అందుకు ట్రంప్ గడువు కూడా విధించారు.
ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటి సంస్థలు టిక్‌టాక్ అమెరికా బిజినెస్ కొనే ప్రయత్నాలు చేశాయి. అయితే మైక్రోసాఫ్ట్ ఈ రేసు నుంచి తప్పుకోగా ఒరాకిల్ రేసులో నిలిచింది. ట్రంప్ మాత్రం ఒరాకిల్, టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ కుదుర్చుకునే ఒప్పందాన్ని తాను ఆమోదించనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో టిక్‌టాక్ పూర్తి కార్యకలాపాలను తమ దేశంలోని సంస్థకే అమ్మేయాలని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ట్రంప్ సర్కార్ ఆదివారం నుంచి టిక్‌టాక్‌తో పాటు వుయ్చాట్పై విధించిన నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆదివారం నుంచి ఈ యాప్‌ల కార్యకలాపాలు అమెరికాలో నిలిచిపోనున్నాయి. అన్ని యాప్స్టోర్ల నుంచి టిక్‌టాక్, వుయ్‌చాట్ యాప్‌లను తొలగించాలని కూడా ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.