Newsచైనాలో కొత్త వ్యాధి... జంతువుల నుంచి మ‌నుష్యుల‌కు.. ల‌క్ష‌ణాలివే

చైనాలో కొత్త వ్యాధి… జంతువుల నుంచి మ‌నుష్యుల‌కు.. ల‌క్ష‌ణాలివే

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి కోవిడ్ -19 వైర‌స్ చైనాలోని వుహాన్ న‌గ‌రం నుంచే ప్ర‌పంచానికి వ్యాప్తి చెందింది. ఈ వైర‌స్ త‌మ‌కు సంబంధం లేద‌ని చైనా ఎంత వాదిస్తున్నా ఈ వైర‌స్ చైనా నుంచే వ్యాప్తి చెందింది అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అత‌లాకుత‌లం అయ్యాయి. ఇప్ప‌ట‌కీ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నుక్కోలేదు. ఈ వైర‌స్ వ‌ల‌లో చిక్కుకున్న ప్ర‌పంచం విల‌విల్లాడుతుండ‌గానే ఇప్పుడు మ‌రో కొత్త వ్యాధి చైనాలో ప్ర‌బ‌లుతోంది.

చైనాలో ఈ కొత్త వ్యాధి ఇప్పుడు అంద‌రిని భ‌య‌పెడుతోంది.  బ్రూసెల్లోసిస్ అనే సరికొత్త వ్యాధి అక్క‌డ గ‌న్స్యూ రాష్ట్రంలో వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ వ్యాధి మూడు వేల మందికి వ్యాపించ‌డంతో అనేక మంది ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. జంతువుల నుంచి ఈ వ్యాధి మ‌నుష్యుల‌కు సంక్ర‌మిస్తుంద‌ని చెపుతున్నారు.

ఈ వ్యాధి భారీన ప‌డిన వారు జ్వ‌రంతో పాటు కీళ్ల నొప్పులు, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. ఇక వీరికి ఆక‌లి కూడా వేయ‌డం లేద‌ని అక్క‌డ రోగుల‌కు వైద్యం చేస్తోన్న వారు చెపుతున్నారు. ఈ వ్యాధి గురించి ఏం చేయాలో తెలియ‌క అక్క‌డ వైద్యులు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news