రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కాపాడేది పోలీస్ శాఖ. అలాంటి పోలీస్ శాఖ అంతా హోం మంత్రి పర్యవేక్షణలో ఉంటుంది. ఈ పోలీస్ శాఖ పర్యవేక్షించే హోం మంత్రికే బెదిరింపు కాల్స్ వస్తే మామూలు షాక్ కాదుగా… ఇప్పుడు అదే జరిగింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బుధవారం మరో రెండు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఉదయం 6 గంటలకు ఆయనకు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించారని సమాచారం. ఈ ఫోన్ కాల్ హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.
కంగనా రనౌత్ అభిమానులే ఈ పని చేసి ఉంటారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వీటిపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. మొత్తం రెండు రోజుల్లోనే ఆయనకు మూడు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని ఆయన అసెంబ్లీలోనే చెప్పారు. ఇక ఆయనకు వచ్చిన మొత్తం బెదిరింపు ఫోన్ కాల్స్ సంఖ్య ఐదుకు చేరుకోవడంతో ముంబై పోలీసులు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించారు.
మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన మాతోశ్రీకి శనివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కూడా సోమవారం బెదరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.