Newsటీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం.. ఆ ప‌ద‌వికి మ‌హిళా నేత రాజీనామా

టీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం.. ఆ ప‌ద‌వికి మ‌హిళా నేత రాజీనామా

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మ‌హిళా నేత త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం అధికార పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎంపీపీ సుధారాణి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనారోగ్య కార‌ణాల‌తో ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టు చెప్పారు. ఆమె త‌న రాజీనామా లేఖను అడిషనల్ కలెక్టర్ కు సమర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ..అనారోగ్య కారణాలతో పాటుగా కుటుంబ బాధ్యతల నిర్వహణకు వీలు కాక‌పోవ‌డంతోనే తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టు చెపుతున్నారు. ఆమె త‌న రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరారు. అయితే ఆమె రాజీనామాకు వ్య‌క్తిగ‌త కార‌ణాలేనా  ?  లేదా ?  రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయా ? అన్న‌దానిపై అధికార పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news