గత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫైనల్లో టైటిల్ ఎగరేసుకుపోయింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో ముంబైను ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో నాలుగో టైటిల్ పడగా.. చెన్నై ఆశలకు చివరి ఓవర్లో గండి పడింది. అయితే ఈ సారి టైటిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ చెన్నైదే అని ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ కవరేజ్‌లో బ్రాడ్‌కాస్టర్స్ హోస్ట్‌గా చేయనున్న బ్రెట్ లీ.. ప్రస్తుతం ముంబైకు చేరుకుని ఐసోలేషన్‌లో ఉన్నాడు.
ఈ క్రమంలోనే పలువురు అడిగిన ప్రశ్నలకు బ్రెట్ లీ సమాధానాలు ఇస్తూ ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ సారి టఫ్ ఫైట్ ఉంటుందని.. విజేతను చెప్పడం కష్టమే అయినా తాను మాత్రం సీఎస్కేనే టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని జోస్యం చెప్పాడు. ఈసారి ఫైనల్-4లో కేకేఆర్ కచ్చితంగా ఉంటుందన్నాడు. గతంలో కేకేఆర్, కింగ్స్ పంజాబ్ జట్ల తరఫున బ్రెట్ లీ ఆడాడు