Newsగూగుల్‌లో భార‌తీయులు వీటి గురించే ఎక్కువ వెదికారా..

గూగుల్‌లో భార‌తీయులు వీటి గురించే ఎక్కువ వెదికారా..

కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడిపోతున్న వేళ గూగుల్లో భార‌తీయులు వేటి గురించి ఎక్కువ ఎతికారో తెలిస్తే ఆస‌క్తికర అంశాలే బ‌య‌ట‌కు వ‌స్తాయి. ముందుగా మ‌న భార‌తీయులు ర‌ష్యా కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెతికారు ? ఆ త‌ర్వాత సుశాంత్ సింగ్‌, పాకిస్తాన్ – ఇంగ్లండ్ టీ 20 మ్యాచ్ వంటివి వెతికారు. ఇక ఆగ‌స్టు నెల సెర్చింగ్ టాప్ – 10 లిస్టు కూడా గూగుల్ వెతికింది. స్పుత్నిక్ – స్పుత్నిక్ వ్యాక్సిన్  కోసం వరుసగా 3,300 శాతం, 2,700 శాతం సెర్చింగ్‌లు పెరిగాయి. ఇక భార‌త ఇండిపెండెన్స్ డే కోసం కూడా 3,750 శాతానికి పైగా సెర్చ్‌లు జరిగినట్టు గూగుల్ నివేదిక పేర్కొంది.

 

ఇక గూగుల్ టాప్ 10లో ఉన్న సెర్చింగ్‌లు ఇవే :

1. అమిత్ షాకు కరోనా పాజిటివా ?

2. దుస్తులపై కరోనా వైరస్ ఎంతకాలం ఉండే ఛాన్స్ ఉంది ?

3. కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి ర‌ష్యా మందు క‌నుగొందా ?

4. జియోలో కరోనా కాలర్ ట్యూన్ ఎలా ఆపాలి ?

5. కరోనా వైరస్‌ను మ‌న‌దేశంలో ఎప్పుడు లాంచ్ చేస్తారు ?

6. ఒళ్లు నొప్పులు ఉంటే అది క‌రోనాకు సంకేతమా ?

7. కరోనాలో ఉష్ణోగ్రత ఎంత?

8. కరోనా లక్షణాలు మ‌నిషికి ఎన్ని రోజుల్లో క‌నిపిస్తాయి ?

9. ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకిందా?

10. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా ఎలా సోకింది ?

పైన ఉన్న 10 ప్ర‌శ్న‌ల‌కు సంబంధించిన అంశాల‌ను గూగుల్లో గ‌త నెల‌లో ఎక్కువుగా సెర్చ్ చేసిన‌ట్టు గూగుల్ సెర్చింగ్ నివేదిక చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news