కోవిడ్ మహమ్మారితో మూతపడిన థియేటర్లు రీ ఓపెన్‌కు సంబంధించిన గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే లాక్‌డౌన్ వల్ల అనేక వ్యాపారాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. గత నాలుగైదు నెలలుగా థియేటర్లు మూతపడడంతో అటు మల్టీఫ్లెక్స్ నిర్వాహకులు, సింగిల్ స్క్రీన్ నిర్వాహకులు థియేటర్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా ? ఈ నష్టాల నుంచి ఎప్పుడు తేరుకుంటామా ? అని వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్‌లో దసరా టైంకు అయినా థియేటర్లు ఓపెన్ అవుతాయేమో అని వెయిటింగ్‌లో ఉన్నారు.
ఈ క్రమంలోనే దసరాకు ముందే థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేలా అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సౌత్, నార్త్ ప్రాంతాల ఫిల్మ్ ట్రేడ్ సభ్యులు, సినిమా, మల్టీఫ్లెక్స్ యజమానులు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను కోరారు. ఈ అధికారుల నుంచి వచ్చిన హామీ మేరకు రెండు రోజుల్లో గుడ్ న్యూస్ వస్తుందని అంటున్నారు.
దసరా, దీపావళి సీజన్లో థియేటర్లు ఓపెన్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఇక థియేటర్ యజమానులు సైతం కనీసం 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అయినా థియేటర్లు రీ ఓపెన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏదేమైనా థియేటర్లు రీ ఓపెన్‌పై గుడ్ న్యూస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ ప్రియులు ఆసక్తితో ఉన్నారు.